Tuesday 8th July 2025
12:07:03 PM
Home > క్రైమ్ > శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జైలర్ సినిమా విలన్ అరెస్ట్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జైలర్ సినిమా విలన్ అరెస్ట్

Actor Vinayakan Arrested | ప్రముఖ మళయాళ నటుడు, జైలర్ ( Jailer ) మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన వినాయకన్ ( Vinayakan ) ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ( Shamshabad Airport ) లో పోలీసులు అరెస్ట్ చేశారు.

మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ ( CISF ) కానిస్టేబుల్ పై దాడి చేశారని, స్థానిక పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. వినాయకన్ కొచ్చి ( Kochi ) నుండి హైదరాబాద్ ( Hyderabad ) మీదుగా గోవా ( Goa ) వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే తాను ఏ తప్పు చేయలేదని, విమానాశ్రయ అధికారులే తనను గదిలో బంధించి వేదించారని వినాయకన్ ఆరోపించారు. అస్సలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారో అర్ధం కావడం లేదని, అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్ ( CCTV Footage ) చెక్ ( Check ) చేయాలని ఈ ప్రముఖ నటుడు కోరాడు.

ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్ లో కూడా మద్యం మత్తులో దురుసు ప్రవర్తన మూలంగా కేరళ పోలీసులు వినాయకన్ ను అరెస్ట్ చేశారు.

You may also like
నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం
‘మైసా’ గా రష్మీక మందన్న..ఫస్ట్ లుక్ వైరల్ !
కన్నప్ప టీంకు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్..కానీ !
anupam kher
ప్రభాస్ మూవీ.. గోడ దూకి షూటింగ్ కు వెళ్లిన సీనియర్ నటుడు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions