Friday 16th May 2025
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ తల్లి విగ్రహం..సీఎం రేవంత్ స్థల పరిశీలన

తెలంగాణ తల్లి విగ్రహం..సీఎం రేవంత్ స్థల పరిశీలన

Telangana Thalli Statue At Secretariat | డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ( B. R. Ambedkar Telangana State Secretariat )లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) స్థల పరిశీలన చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు.

డిసెంబర్ 9 న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటునకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు.

ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు.

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘దేశ వ్యాప్తంగా తెలంగాణ కుల గణన సర్వేకు ప్రశంసలు’
‘ఆ ఇందిరమ్మకే తెలియాలి’
సింగపూర్ లో సీఎం రేవంత్..ఆ దేశ మంత్రితో భేటీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions