Thursday 1st May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ అసెంబ్లీ ఫలితాలపై స్పందించిన వైఎస్ షర్మిల .. ఏమన్నారంటే!

ఏపీ అసెంబ్లీ ఫలితాలపై స్పందించిన వైఎస్ షర్మిల .. ఏమన్నారంటే!

sharmila

Sharmila Comments on AP Results | ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై (AP Election Results) పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లకు శుభాకాంక్షలు చెప్పారు.

‘ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి.

సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది” అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేశారు షర్మిల.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions