Mansoor Comments On Chiranjeevi | దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష(Trisha)ను ఉద్దేశించి తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
లియో (Leo) సినిమాలో హీరోయిన్ త్రిష తో రేప్ సీన్ చేసే అవకాశం రాలేదంటూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు మన్సూర్ కామెంట్లను తీవ్రంగా ఖండించారు.
చిరంజీవి (Chiranjeevi), లోకేష్ కనగరాజ్, నాగ చైతన్య, మాళవిక మోహనన్, నితిన్ తదితరులు త్రిషకు మద్దతుగా నిలిచారు. మన్సూర్ చేసిన కామెం ట్స్ దారుణమని తప్పు బట్టారు.
చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యం తరకర వ్యా ఖ్య లు నా దృ ష్టికి వచ్చాయి.
వక్రబుద్ధితో ఇలాం టివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాం టి వ్యా ఖ్య లు ఏ అమ్మాయికి వచ్చినా నేను అం డగా, సపోర్ట్ గా నిలబడతాను అని ట్వీ ట్ చేశారు.
ఏకం గా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. చివరికి మహిళా కమిషన్ కూడా స్పందించింది.
చివరికి మన్సూర్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ముగిసిపోయింది. అయితే అంతలోనే మన్సూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవిపై పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు వేయనున్నట్లు తెలిపారు.
చిరంజీవితో పాటు నటి ఖుష్బు , త్రిష లపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, వీరు తమ మాటలతో తనను హింసిం చరని.. అలాగే ఇతరులను రెచ్చ గొట్టడం లాంటి తదితర కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు.
త్వరలో వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని మన్సూర్ తెలిపారు. ఎవరో కావాలనే వైరల్ చేసిన వీడియోని తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారని వాపోయారు.
ఈ కేసులో తాను నిజమైన వీడియోను పం పానని, అలాగే మరికొన్ని ఆధారాలతో కేసుని వేయబోతున్న ట్లు మన్సూర్ మరోసారి నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.