Saturday 5th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భార్య పుట్టినరోజు మరిచిపోతే ఐదేళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా!

భార్య పుట్టినరోజు మరిచిపోతే ఐదేళ్ల జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా!

Couple

Samoa | ప్రస్తుత పోటీ ప్రపంచంలోని యాంత్రిక జీవితంలో ఆఫీసే ఒక ఫ్యామిలీలా మారిపోయింది. దీంతో అనేకమంది పనిలో పడుతూ తమ కుటుంబంతో అనుబంధాన్ని చాలా కోల్పోతున్నారు.

ముఖ్యంగా పని ఒత్తిడిలో పడి కుటుంబ సభ్యుల జీవితాల్లో ముఖ్యమైన తేదీలను మరిచిపోతున్నారు. జీవిత భాగస్వామి పుట్టినరోజులు (Birthdays) కూడా గుర్తుంచుకోవడం లేదని కొన్ని సర్వేల్లో తేలింది.

దంపతుల మధ్య తగాదాలకు దారితీసే ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే, పాలినేషియన్ ద్వీప దేశమైన సమోవా (Samoa)లో మాత్రం భార్య పుట్టిరోజు మరిచిపోతే భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

సమోవాలో, భర్త తన భార్య పుట్టినరోజును మొదటిసారి మరచిపోతే, అతన్ని హెచ్చరిస్తారు. అదే తప్పును రెండోసారి పునరావృతం చేస్తే భర్తకు జరిమానా లేదా జైలు శిక్ష (Jail) విధించబడుతుంది.

అక్కడి చట్టం ప్రకారం ఈ నేరానికి ఒక వ్యక్తి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అంతేకాదు దీనికోసం అక్కడ ఇందుకోసం పోలీసు స్థాయిలో ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ఈ బృందం అటువంటి ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే చర్యలు తీసుకుంటుంది.  

You may also like
covid 19 vaccine
కోవిడ్ 19 వ్యాక్సిన్లకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన!
bombay high court
“ఐ లవ్ యూ చెప్పడం నేరం కాదు..” బాంబే హైకోర్టు!
రోడ్డు మధ్యలోనే భారీ చెట్లు..బీహార్ అధికారుల మరో ఘనత
ఆవును చంపిందనే కోపంతో పులులకు విషం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions