Dubbak mla raghunandan rao arrest
Hyderabad|
దుబ్బాక శాసనసభ్యులు, బీజేపీ నేత రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గడిచిన రెండురోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఒక వ్యక్తి శివాజీ విగ్రహం వద్ద మూత్రవిసర్జన చెయ్యడం ఆ వ్యక్తి ముస్లిం అవ్వడం వలన ఒక్కసారిగా గజ్వేల్ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆ వ్యక్తిని శివాజీ విగ్రహ కమిటీ సభ్యులు పోలీసులకు అప్పగించారు.తర్వాత హిందూ సంఘాల ఆధ్వర్యంలో గజ్వెల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఆ ర్యాలీలో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని నిందితులని పట్టుకొని శిక్షిస్తామని హిందూ సంఘాలకు హామీ ఇచ్చారు.
ఇలాంటి సమయంలో రఘునందన్ రావు గజ్వెల్ బయలుదేరారు.హైదరాబాద్ నుండి బయలు దేరిన రఘునందన్ రావు ను పోలీసులు హాకింపేట ఎయిర్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్టు చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సంఘటన పై స్పందించిన ఈటెల రాజేందర్ పోలీసుల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.ఇటువంటి అక్రమ అరెస్ట్ లు సరికావని అన్నారు. వెంటనే రఘునందన్ రావు ను విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. అలాగే రఘునందన్ రావు కు ఫోన్ చేసి మాట్లాడారు.