Wednesday 14th May 2025
12:07:03 PM
Home > తాజా > ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

100% Tax Exemption For Electric Vehicles In Telangana | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు ( Electric Vehicles ) కొనుగోలు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

రోడ్ ట్యాక్స్ ( Road Tax ), రిజిస్ట్రేషన్ చార్జీల ( Registration Charges ) నుండి 100 శాతం మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహన నూతన పాలసీకి సంబంధించి జీవో 41ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) ఆదివారం విడుదల చేశారు.

సోమవారం నుండి డిసెంబర్ 31 2026 వరకు ఈ పాలసీ ( Policy ) అమలు కానున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే ఈ గడువు పొడిగించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

ట్యాక్స్ లు, చార్జీల మినహాయింపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100ల కోట్ల ఆదాయం కోల్పోతుందని, అయినప్పటికీ కాలుష్యం నుండి భవిష్యత్ తరాల్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని రూపొందించినట్లు చెప్పారు.

You may also like
‘PSPK’s OG..ఈసారి ముగిద్దాం’
గతంలో ఉగ్రవాది..ప్రస్తుత సిరియా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ
ఆ రోజు ఆయుర్వేద దినోత్సవం..ప్రత్యేకత ఏంటో తెలుసా!
తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ‘సరస్వతీ పుష్కరాలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions