Loco Pilot Stops Train For cigarettes | ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో భారతీయ రైల్వే లోకో పైలట్ నిర్లక్ష్యానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సిగరెట్ తాగాలనే తహతహతో లోకో పైలట్ ఏకంగా రైలును 10 నిమిషాలపాటు నిలిపివేశాడు.
వివరాల ప్రకారం, డిసెంబర్ 17న NTPC ప్రాజెక్ట్ నుంచి బొగ్గుతో ఉన్న గూడ్స్ రైలు తిరిగి వెళ్తుండగా, లోకో పైలట్ ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలును నిలిపివేసి సిగరెట్ తీసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన ఊంచహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాన్ రైల్వే క్రాసింగ్ వద్ద చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల మాటల ప్రకారం, రైలు సుమారు 10 నిమిషాల పాటు క్రాసింగ్ వద్ద నిలిచిపోయి, రోడ్డు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా, రైల్వే అధికారులు స్పందించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని ఆదేశిస్తూ, స్టేషన్ సూపరింటెండెంట్‌కు విచారణ బాధ్యతలను అప్పగించారు. దర్యాప్తు అనంతరం సంబంధిత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.









