Monday 12th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బ్రాహ్మణికి పోలీసులతో వందనం చేయించడం కాదు : వైసీపీ

బ్రాహ్మణికి పోలీసులతో వందనం చేయించడం కాదు : వైసీపీ

Ycp On Gudlavalleru college Incident | గుడివాడ ( Gudivada )లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ( Engineering College )లో బాలిక హాస్టల్ ( Girls Hostel ) లో రహస్య కెమెరాల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) విచారణ ఆదేశించారు. ఈ క్రమంలో వైసీపీ ( YCP ) స్పందించింది.


” మీ భార్య నారా బ్రాహ్మణి ( Nara Brahmani )కి పోలీసులతో వందనం చేయించడం కాదు, కాలేజీలోనే రక్షణ లేక అర్థరాత్రి ఆక్రందనలు చేస్తున్న ఆడపిల్లలకు న్యాయం చేయండి..


లేడీస్‌ హాస్టల్‌ బాత్రూంలో హిడెన్‌ కెమెరా లేదని ఒక్క రాత్రి విచారణలోనే పోలీసులు ఎలా తేల్చేసారో చెబుతారా హోం మంత్రి ? ఇప్పటికైనా మీకు తీరిక చిక్కితే విద్యార్థులను కలిసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పండి.

న్యాయం కోసం నినదిస్తున్న విద్యార్థులపైనే రివర్స్‌ కేసులు పెడతామని బెదిరించే ఈ ప్రభుత్వంలో బాధితులకు న్యాయం దొరకుతుందా ? రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో సొంత వర్గీయులకు చెందిన కాలేజీపై చర్యలు తీసుకోకూడదని రాసుకున్నారా?” అని జగన్ పార్టీ ( Jagan Party ) ప్రశ్నించింది.

You may also like
‘వైసీపీ ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తున్నారు’
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు..బాబు ముసుగు తొలిగిందన్న వైసీపీ
‘కుటుంబంతో పోటీ..ఎన్నికల కంటే కష్టం’
చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions