– సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసలు!
Kohli Gives Gift to Vishal Jaiswal | ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన గుజరాత్ ఢిల్లీ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
విరాట్ కొహ్లీ మరోసారి తన క్రీడాస్ఫూర్తిని చాటుకొని, అందరి మనసు గెలుచుకున్నారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనతో కోహ్లీ వికెట్ పడగొట్టాడు. అయితే కొహ్లీ ఆ కుర్రాడి ప్రతిభను అభినందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ నేరుగా ఆ విశాల్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. అంతేకాకుండా, తనను అవుట్ చేసిన బాల్ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి విశాల్‌కు బహుమతిగా అందించాడు. విశాల్ జైస్వాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
“ప్రపంచ క్రికెట్‌ను శాసించే విరాట్ భాయ్ వికెట్ తీయడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం” అంటూ విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 254 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో గుజరాత్ 247 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 77 పరుగులు చేసిన కొహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.





