Friday 22nd November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం.. 15 మంది అరెస్ట్

మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం.. 15 మంది అరెస్ట్

Violent riots in Maharashtra and Karnataka.. 15 people arrested

-ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అదుపులోకి..
-పేలుడు పదార్థాలను తయారేచేశారనే అనుమానాలు
-రెండు రాష్ట్రాల్లో మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాల సోదాలు

ఐఎస్ఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) శనివారం రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలోని మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాలు తనిఖీలు చేశాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐఎస్ఐఎస్ అనుమానిత టెర్రరిస్టులు 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మహారాష్ట్ర, కర్ణాటకలో కలకలం రేగింది. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిలో పలువురు ఇటీవలే అరెస్ట్ అయి, బెయిల్ పై బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబై పక్కనే ఉన్న థానె, పూణేలతో పాటు మిరాభయాందర్ లలో ఎన్ఐఏ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో ఆకిఫ్ అతీఖ్ నాచన్ సహా ఏడుగురిని అరెస్టు చేసింది. నాచన్ కిందటి ఆగస్టులో పేలుడు పదార్థాల తయారీ కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి తిరిగి టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిసిందన్నారు. అయితే, మిగతా ఆరుగురిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, అరెస్టు కాలేదని వివరించారు. మిగతా ఆరుగురిని థానె తో పాటు కర్ణాటకలో అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

You may also like
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా
అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి
వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions