Vaibhav Suryavanshi honoured with Pradhan Mantri Rashtriya Bal Puraskar in Delhi | క్రికెట్ ప్రపంచంలో అతి పిన్న వయసులోనే సంచలనాలు నమోదు చేస్తున్న వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం దక్కింది. ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ ను తాజగా అందుకున్నాడు వైభవ్. దేశంలో చిన్నారులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఇదే కావడం విశేషం. శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ బాలల పురస్కారాన్ని అందుకున్నారు.
ఐదు నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ధైర్యం, కళలు, సైన్స్, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఈ సంవత్సరం మొత్తం 20 మంది చిన్నారులు ఈ అవార్డు కోసం ఎంపికయ్యారు. ఇకపోతే డొమెస్టిక్, అండర్-19, ఐపీఎల్ లో వైభవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెల్సిందే. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బీహార్ తరఫున ఆడుతున్న వైభవ్ తాజగా అరుణాచల్ ప్రదేశ్ పై 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి అదరగొట్టాడు. ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ ఆడుతున్న విషయం తెల్సిందే.









