Two Indigenous Players Feature In Australia Test XI For First Time Ever | అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగే ఈ సిరీస్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సాధించింది.
యాషెస్ సిరీస్ లో భాగంగా ఒకేసారి ఇద్దరు అసలైన ఆస్ట్రేలియా భూమిపుత్రులు కలిసి ఆడనున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అత్యధిక ఆటగాళ్ల పూర్వీకులు ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డవారే. అయితే స్కాట్ బోలాండ్ మరియు బ్రెండన్ డగెట్ మాత్రం అసలైన భూమిపుత్రులు. అంటే స్థానిక గిరిజన తెగకు చెందిన వారసులు. ఇలా గిరిజన వారసత్వం ఉన్న ఆటగాళ్లు ఒకేసారి ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
జేసన్ గిలెప్సీ ఆస్ట్రేలియా మెన్స్ టీం తరఫున బరిలోకి దిగిన మొదటి గిరిజన తెగకు చెందిన ప్లేయర్ గా చరిత్ర సృస్తుంచాడు. ఆ తర్వాత స్కాట్ బోలాండ్ రెండవ ప్లేయర్. ఇప్పుడు బ్రెండన్ డాగెట్ మూడవ ఆటగాడు. ఇంగ్లాండ్ తో శుక్రవారం నుండి మొదలయ్యే యాషెస్ సిరీస్ లో బోలాండ్, బ్రెండన్ కలిసి అడనున్నారు. ఇలా ఇద్దరు గిరిజన తెగకు చెందిన అసలైన ఆస్ట్రేలియా భూమిపుత్రులు కలిసి ఒకే మ్యాచులో ఆడడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హెజిలవుడ్ తొలి టెస్టుకు దూరం అయ్యారు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు.









