TGPSC Group-1 Mains Result Cancelled Telangana | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పై రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఎంపిక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయకూడదని మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జులై 7న హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెల్లడించారు. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును మరియు మార్కుల జాబితాను న్యాయస్థానం కొట్టివేసింది.
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. 8 నెలల్లో రీవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తుది తీర్పు వెలువరించింది.









