Telangana panchayat Election Results | ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన 94 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 87 స్థానాల్లో మెజారిటీ సీట్లు సాధించారని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లెక్క పక్కా, 94 స్థానాల్లో 87 తమ సొంతం అని అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గాను 12,702 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా తమకు 7,527 గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఆశీర్వదించారని ఇది ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించడంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయానికి రానున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.









