TDP Janasena List | ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నిలకు టీడీపీ-జనసేన కూటమి (TDP-Janasena Alliance) తొలి జాబితాను శనివారం ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా కూటమి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ (TDP-janasena first list) ను విడుదల చేశారు.
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 118 అభ్యర్థులను తొలి జాబితాలో విడుదల చేశారు. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్తు ప్రకటించగా, 24 స్థానాలకు గానూ జనసేన ఐదుగురు పేర్లు ఖరారు చేసింది.
ఈ నేపథ్యంలో పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం జగన్ (CM Jagan) పై పోటీ చేసేందుకు టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది.
Read Also: టీడీపీ జనసేన కూటమిలో118 సీట్లు ఖరారు.. జనసేనకు ఎన్నంటే!
పులివెందుల టీడీపీ అభ్యర్థి (Pulivendula TDP Candidate) గా మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి (B-Tech Ravi)ని ప్రకటించారు చంద్రబాబు. ఇప్పటివరకు టీడీపీ తరఫున సతీష్ రెడ్డి (Satish Reddy) పోటీ చేయగా తొలి సారి బిటెక్ రవి బరిలో నిలవనున్నారు.
కాగా 1978 నుండి పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచు కోటగా ఉంది. కానీ వైఎస్ కుటుంబంలో (YS Family) విబేధాలు, వైఎస్ వివేకా హత్య లాంటి అంశాలు తమకు కలసి వస్తాయని భావిస్తుంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే సతీశ్ రెడ్డి స్థానంలో బీటెక్ రవిని కన్ఫాం చేసింది.