Supreme Court On Stay Dogs Issue | వీధి కుక్కల (Stray Dogs Issue) సమస్యపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై తరచూ పిటిషన్లు దాఖలవుతుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
“అందరూ కుక్కల గురించే మాట్లాడుతున్నారు.. ఇతర జంతువుల ప్రాణాలు విలువలేనివా.. కోళ్లు, మేకల గురించి ఎందుకు మాట్లాడరు?” అని కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) ను ప్రశ్నించింది.
కుక్క కరవబోతుందా లేదా అనేది దగ్గరకు వచ్చేవరకు తెలియదని, ఈ సమస్యకు చికిత్సకంటే నివారణే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల వద్ద వీధి కుక్కల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు అవసరమని పేర్కొంది. ఈ సందర్భంగా కపిల్ సిబల్ స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, షెల్టర్ల ద్వారా సమస్యను నియంత్రిస్తున్నారని, భారత్‌లో సరైన అమలు లేకపోవడం, చెత్త సమస్య వల్ల తీవ్రత పెరుగుతోందన్నారు.









