South African all-rounder Chloe Tryon gets engaged to Choreographer Michelle Nativel | సౌత్ ఆఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ క్లోయి ట్రయాన్ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న మిచెల్ నాటివెల్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. రింగ్ తో మిచెల్ కు ప్రపోస్ చేసిన ట్రయాన్ ఆమె యెస్ చెప్పడంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మహిళ తన జీవితంలో మెయిన్ ప్లేయర్ అంటూ ట్రయన్ పోస్ట్ చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో ట్రయాన్ అభిమానులు మరీ ముఖ్యంగా యువకులు హార్ట్ బ్రోకెన్ ఎమోజీలతో రియాక్ట్ అవుతున్నారు. ఇద్దరు యువతులు పెళ్లికి సిద్ధం అవ్వడం క్రికెట్ లో చరిత్రలో ఇది అరుదైన సంఘటనగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కాబోయే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే మహిళా క్రికెటర్లు అభినందనలు తెలియజేస్తున్నారు. 2025 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓటమి పాలైన సౌత్ ఆఫ్రికా జట్టులో ట్రయాన్ కూడా ఉన్నారు. ఇకపోతే మిచెల్ ప్రముఖ మోడల్ అని తెలుస్తోంది.









