Saudi Arabia-Pakistan defence pact | పాకిస్థాన్ మరియు సౌదీ అరేబియా మధ్య స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రీమెంట్ కుదిరింది. అంటే ఈ రెండు దేశాలలో ఏ ఒక్క దేశంపైన మరో దేశం దాడి చేస్తే అది ఇరు దేశాలపై దాడిగా పరుగణించడం జరుగుతుంది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రియాద్ లో జరిగిన భేటీలో ఈ మేరకు ఇరువురు దేశాధినేతలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
పాకిస్థాన్ మరియు సౌదీ అరేబియాలో దేనిపైనైనా మరో దేశం దాడి చేస్తే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా భావిస్తారు. అప్పుడు ఈ రెండు దేశాలు కలిసి దాడి చేసిన దేశంపై పోరాడుతారు అనేది ఒప్పంద సారాంశం. కాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ లో నక్కిన ఉగ్రవాదులపై ‘ఆపరేషన్ సింధూర్’ ను చేపట్టిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో భారత్-పాకిస్థాన్ మధ్య కొన్నిరోజుల ఘర్షణ జరిగింది. ఈ తరుణంలో పాక్-సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం చర్చనీయాంశంగా మారింది.









