Satyanarayana Swamy Vratham | దేశవ్యాప్తంగా దీపావళి శోభ సంతరించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి చాలా ప్రత్యేకం. వ్రతాలు, నోములతో ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. దీపావళి అమవాస్య మరుసటి రోజు నుంచి కార్తిక మాసం భక్తులకు మరింత ప్రత్యేకం. నెల రోజులుపాటు అత్యంత పవిత్రంగా కార్తీక మాసాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా కార్తిక మాసం అంతా శివారాధనతో ఆలయాలన్నీ మార్మోగిపోతాయి. ఇక దీపావళి మొదలు, పంచమి, దశమికి కేదారేశ్వర వ్రతం (నోములు), సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకొంటారు.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ప్రాముఖ్యంహిందూ సంప్రదాయంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవైనా ముఖ్యమైన శుభకార్యాలు జరిగిన ప్రతి సందర్భంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. సాధారణంగా వైశాఖ, శ్రావణ మాసాలు, ప్రతి నెలా ఏకాదశి లాంటి పర్వదినాల్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు.
ఇక దీపావళి అమవాస్య మరుసటి రోజు నుంచి కార్తిక మాసం భక్తులకు మరింత ప్రత్యేకం. నెల రోజులుపాటు అత్యంత పవిత్రంగా కార్తీక మాసాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా కార్తిక మాసం అంతా శివారాధనతో ఆలయాలన్నీ మార్మోగిపోతాయి. దీపావళి మొదలు, పంచమి, దశమికి సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతం (నోములు) జరుపుకొంటారు. కొత్తగా పెళ్లైన వారు, నూతన గృహ ప్రవేశం చేసినప్పుడు, నూతన కార్యక్రమములు ప్రారంభించినప్పుడు విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
సత్యనారాయణ స్వామి వ్రత విధానం
ఇంటిలో ఈశాన్య మూలన సత్యనారాయణ స్వామి వ్రతం చేసే చోటును శుద్ధి చేయాలి. అక్కడ ఐదు రంగుల పొడులతో ముగ్గులు పెట్టాలి. అక్కడ వ్రతం పీటను ప్రతిష్టించాలి. ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. పీట లోపల కొత్తది తెల్లటి వస్త్రాన్ని పరిచి, దానిమీద బియ్యం పోయాలి. బియ్యం మధ్యలో కలశము అంటే రాగి చెంబును పెట్టాలి. ఆ కలశంపై మరో కొత్త వస్త్రాన్ని అంటే జాకెట్ పీస్ ను పెట్టి, దానిపై సత్యనారాయణ స్వామిని ప్రతిమను ఉంచాలి. పీటలో సత్యనారాయణ స్వామి ఫొటోను కూడా ఉంచవచ్చు.
పీటంలోని మండపంలో పంచలోక పాలకులు, నవగ్రహాలు, అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించాలి. ఆ తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూచించాలి. పూజానంతరము సత్యనారాయణ కథలు విని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి.
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ముందు పసుపు గణపతి పూజ చేయాలి. అనగా పసుపుతో సుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేయాలి. దానికి కుంకుమ బొట్టు పెట్టి, తర్వాత ఒక పళ్లెంలోగాని, కొత్త వస్త్రం మీద పెట్టి, బియ్యం పోసి దానిపై ఒక తమలపాకులో ఆ పసుపు గణపతిని ప్రతిష్టించాలి. అగరువత్తులు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైరుతి దిశలో చేయవలెను. గణపతి పూజ చేసిన అనంతరం పంచలోక పాలకులు అనగా గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరీ దేవతలను మండపము అనగా పీటలో ఉత్తరాంతము అయ్యే విధంగా ప్రతిష్టించాలి. ఒక్కో దేవతను స్మరిస్తూ ఒక్కొ దేవతను స్మరించి తమలపాకు, వక్క, ఎండు ఖర్జూరం, పసుపు కొమ్ము, పుష్పం సమర్పిస్తూ ఉండాలి. నవగ్రహ ఆరాధన చేయాలి. సూర్యుడు-మధ్యలో, చంద్రుడు-ఆగ్నేయం, కుజుడు దక్షిణం, బుధుడు-ఈశాన్యం, గురుడు ఉత్తరం, శుక్రుడు-తూర్పు, శని-పశ్చిమం, రాహువు-వాయవ్యం, కేతువు-నైఋతి వైపు ఉండేలా పేర్చుకోవాలి.
అనంతరం అష్ట దిక్పాలకులను ఉంచాలి. సూర్యుడు – తూర్పు దిక్కు, అగ్ని ఆగ్నేయం, యముడు దక్షిణం,
నిరృతి నైరుతి, వరుణుడు పడమర, వాయువు వాయవ్యం, కుబేరుడు ఉత్తరం, ఈశానుడు ఈశాన్యం. ఇలా ఒక్కో దేవత ఆయా వైపుల ఉండేలా అమర్చుకోవాలి. అనంతరం కలశంలో స్వామిని ఆవాహన చేసి పూజించాలి.
సత్యనారాయణ స్వామి పూజకు కావలసిన పూజా సామగ్రి
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సామగ్రి:
శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటం
పసుపు : 100 గ్రాములు
కుంకుమ : 100 గ్రాములు
విడిపూలు : 1 గ్రాములు
పూలమూరలు : 20
పండ్లు : 5 రకాలు
తమలపాకులు : 100
వక్కలు : 200 గ్రాములు
అగరుబత్తీలు : 1 ప్యాకెట్
హరతికర్పూరం : 200 గ్రాములు
గంధం : 1 డబ్బా
ఖర్జూరపండ్లు : 100 గ్రాములు
పసుపుకొమ్ములు : 150 గ్రాములు
టవల్స్ : 2
జాకెట్ ముక్కలు : 1
బియ్యము : 3 కిలోలు.
కొబ్బరికాయలు : 9
చిల్లరడబ్బులు : 21
దారపుబంతి : 1
ఆవు పాలు : 1/2 లీటర్.
ఆవు పెరుగు : 50 గ్రాములు
ఆవు నెయ్యి : 100 గ్రాములు
తేనే : 100 గ్రాములు
పంచదార : 1 గ్రాములు
యాలకులు : 10 రూ.
జీడిపప్పు : 100 గ్రాములు
కిస్మిస్ : 50 గ్రాములు
గోధుమ రవ్వ : 1 కేజి
దీపారాధన కుందులు : 1 సెట్
వత్తులు : 1 ప్యాకెట్
నువ్వుల నూనే : 1 కిలో
కలశం చెంబు : 1
గణపతి పూజ
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!
ఆచమనం:
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః
(నీళ్లను పళ్లెంలో వదలాలి. తదుపరి నమస్కారం చేస్తూ ఈ క్రింది నామాలను పఠించాలి)
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయనమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
శచీపురందరాభ్యాం నమః
అరుంధతీవశిష్ఠాభ్యాం నమః
శ్రీసీతారామాభ్యాం నమః
నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః
అయం ముహూర్తః సుముహూర్తోఅస్తు ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మసమారభ ప్రాణాయామం చేసి అందరూ అక్షతలు వెనుకకు వేసుకోవాలి. కుడి చేతితో ముక్కు పట్టుకుని క్రింది ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకోవాలి.
ప్రాణాయామం
ఓ భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్పం : మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాఙ్ఞేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (ఇక్కడ శ్రీశైలానికి మీ ప్రాంతం ఏ దిక్కున ఉన్నదో చెప్పుకోవాలి) గంగా గోదావరియోర్మధ్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ….సంవత్సరే .. ఆయనే.. మాసే.. పక్షే.. తిథౌ.. వాసరే.. శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్.. గోత్రః.. (మీ గోత్రం చెప్పుకోవాలి) నామధేయః.. (మీపేరు చెప్పుకోవాలి) ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్విధ పురుషఫలావ్యాప్త్యర్ధం, చింతిత మనోరథ సిద్ధ్యర్ధం, శ్రీసత్యనారాయణస్వామి ముద్దిశ్య శ్రీసత్యనారాయణ స్వామి ప్రీత్యర్ధం అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే.
ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీమహాగణపతి పూజాం కరిష్యే, తదంగ కలశారాధానం కరిష్యే.
కలశారాధన
కలశానికి గంధం, కుంకుమబొట్లు పెట్టాలి. అందులో ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశాన్ని మూసి కింది మంత్రాన్ని జపించాలి.
కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశిత్రాః
కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశిత్రాః
మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేద స్సామవేదోహ్యధర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
ఏవం కలశపూజాః
ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యాలపై, అందరి శిరస్సులపై చల్లాలి.
ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్యః
కలశంలోని జలాన్ని పుష్పంతో దేవుని పైన, పూజాద్రవ్యాలపైన, తమపైన జల్లుకోవాలి. ఆ తర్వాత పసుపు వినాయకునిపై కొద్దికొద్దిగా జలం చల్లుతూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి.
ఓం గణానాంత్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనం
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు పసుపు గణపతిపై చల్లుతూ ఈ పూజ చేయాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి (గంధం చల్లాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లాలి)
అనంతరం పసుపు గణపతిపై పూలు జల్లుతూ కింది మంత్రాలు పఠించాలి)
ఓ సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓ గజాననాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓ గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓ శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం మహా గణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తుల ధూపం చూపించాలి)
(పసుపు గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి)
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి
శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
(కొద్దిగా నీరు పళ్లెంలో వదలాలి)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి (తాంబూలం ఇచ్చి, కర్పూరం వెలిగించి స్వామికి చూపించాలి.) ఓం గణానాంపతిం గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనం
శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయాకృత యథాశక్తి పూజయాచ శ్రీమహాగణపతిః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
(గణపతికి నమస్కరించాలి. ఆయన పాదాల వద్ద గల అక్షతలు, పూలు శిరస్సున ధరించాలి. ఆ తరువాత పసుపు గణపతిని కొద్దిగా కదిలించాలి)
శ్రీమహాగణాధిపతయే నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి
|| శ్రీమహాగణపతి పూజ సమాప్తం ||
పంచలోక పాలక పూజ ఆచమనం:
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః
(నీళ్లను పళ్లెంలో వదలాలి. తదుపరి నమస్కారం చేస్తూ ఈ క్రింది నామాలను పఠించాలి)
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః
కలశానికి ఎడమవైపున (మీకు కుడివైపున) తమలపాకులు, వక్కలు, అరటిపండు లేదా ఖర్జూరంతో కూడిన తాంబూలాలు పెడుతూ అయిదుగురు దేవతలకు అక్షతలు వేసి నమస్కరించాలి.
పునః సంకల్పం
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీ సత్యనారాయణ పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీ సత్యనారాయణ వ్రతాంగత్వేన గణపత్యాది పంచలోక పాలకపూజాం, ఆదిత్యాది నవగ్రహ పూజాం చ కరిష్యే
ఓం గణపతయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం పరబ్రహ్మణే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం బ్రహ్మాణం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం విష్ణవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం విష్ణుం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి
ఓం రుద్రవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివారసమేతం రుద్రం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి
ఓం గౌర్యై నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పతీపుత్ర పరివార సమేతాం గౌరీం లోకపాలికాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి
గణేశాది పంచలోకపాలక దేవాతాభ్యో నమః రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలను సమర్పించాలి)
గణేశాది పంచలోక పాలక దేవతాప్రసాద సిద్ధిరస్తు
నవగ్రహ పూజ
ఓం సూర్యాయ నమః పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నదికరణే రవిం వర్తులాకార మండలే స్థాపయామి, పూజయామి. ఓం అగ్నయే నమః రవిగ్రహస్య అధిదేవతా అగ్నిం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం రుద్రయే నమః రవిగ్రహస్య ప్రత్యధిదేవతా రుద్రం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి.
ఓం చంద్రయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం చంద్రగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే స్థాపయామి, పూజయామి. ఓం అప్సుయే నమః చంద్రగ్రహస్య అధిదేవతా అపం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం గౌర్యై నమః చంద్రగ్రహస్య ప్రత్యధిదేవతా గౌరీం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి
ఓం అంగారకాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివారసమేతం అంగారక గ్రహం ఆవాహయామి. సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే స్థాపయామి, పూజయామి. ఓం పృథ్వియే నమః అంగారకగ్రహస్య అధిదేవతా పృథ్వీం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి, పూజయామి. ఓం క్షేత్రపాలకాయ నమః అంగారకగ్రహస్య ప్రత్యధిదేవతా క్షేత్రపాలకం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి
ఓం బుధాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బుధగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే స్థాపయామి, పూజయామి. ఓం విష్ణవే నమః బుధగ్రహస్య అధిదేవతా విష్ణుం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం క్షేత్రపాలకాయ నమః బుధగ్రహస్య ప్రత్యధిదేవతా నారాయణం ఆవాహయామి. ఉత్తరతః స్థాపయామి పూజయామి.
ఓం గురవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివారసమేతం గురుగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే స్థాపయామి, పూజయామి. ఓం బ్రహ్మణే నమః గురుగ్రహస్య అధిదేవతా బ్రహ్మాణం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రయే నమః గురుగ్రహస్య ప్రత్యధిదేవతా ఇంద్రం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి
ఓం శుక్రాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ప్రాక్ భాగే స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రాణ్యై నమః శుక్రగ్రహస్య అధిదేవతా ఇంద్రాణీం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రమరుత్వంతయే నమః శుక్రగ్రహస్య ప్రత్యధిదేవతా ఇంద్రమరుత్వంతం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి.
ఓం శనైశ్చరాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివారసమేతం శనైశ్చర గ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే స్థాపయామి పూజయామి. ఓం యమాయ నమః శనిగ్రహస్య అధిదేవతా యమం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం ప్రజాపతయే నమః శుక్రగ్రహస్య ప్రత్యధిదేవతా ప్రజాపతిం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి.
ఓం రాహువే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివారసమేతం రాహుగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య నైరుతీ దిగ్భాగే స్థాపయామి పూజయామి. ఓం గాం నమః రాహుగ్రహస్య అధిదేవతా గాం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం సర్పయే నమః రాహుగ్రహస్య ప్రత్యధిదేవతా సర్పం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి
ఓం కేతవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య వాయవ్య దిగ్భాగే స్థాపయామి, పూజయామి. ఓం చిత్రగుప్తవే నమః కేతుగ్రహస్య అధిదేవతా చిత్రగుప్తం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం బ్రహ్మణే నమః కేతుగ్రహస్య ప్రత్యధిదేవతా బ్రహ్మాణం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి.
అధిదేవతా ప్రత్యధిదేవాతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవాతాభ్యో నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.
(అక్షతలను సమర్పించాలి)
అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్తు
అష్టదిక్పాలక పూజ
ఓం ఇంద్రవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ప్రాగ్దిగ్భాగే ఇంద్రం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి.
ఓం అగ్నయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం యమాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం దక్షిణ దిగ్భాగే యమం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం నిరుతయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం నైరుతి దిగ్భాగే నిరుతిం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం వరుణయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం వాయవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం వాయవ్య దిగ్భాగే వాయుం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం కుబేరాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజమామి
ఓం ఈశానాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఈశాన దిగ్భాగే ఈశానం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఇంద్రాద్రి అష్టదిక్పాలక దేవతాభ్యోనమః ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలను సమర్పించాలి)
ఇంద్రాది అష్టదిక్పాలక దేవతా ప్రసాద సిద్ధిరస్తు
సత్యనారాయణ స్వామి పూజ
శ్రీసత్యనారాయణస్వామి ప్రతిమను తమలపాకుపై ఉంచి ముందుగా పంచామృతాలతో శుద్ధి చేయాలి.
పాలు: ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్ణియం భవా వాజస్య సంగథే.
పెరుగు: దధిక్రావుణ్ణో అకారిషం, జిష్ణోరశ్వస్యవాజినః సురభినో ముఖాకరత్ర్పణ ఆయూగం షితారిషత్.
నెయ్యి: శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః.
తేనె: మధువాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః మాధ్వీస్సంత్వోషధీః మధుసక్తముతోసి మధుమత్సార్థివగ్ం రజః మధుద్యౌరసునః పితా, మధుమాన్నో వనస్పతిః మధుమాగ్ం అస్తు సూర్యః, మాధ్వీర్గావో భవంతు నః
శుద్ధోదకం (నీటిని పోస్తూ) : స్వాధుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగం అదాభ్యః
శుద్ధోదకస్నానం (నీటితో స్వామికి స్నానం) : ఆపోహిష్ఠా మయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః, తస్మా అరంగమామవో యస్యక్షయాయ జిన్వథ, ఆపోజనయథాచనః
ప్రాణాప్రతిష్ఠాపనం
ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః, ఋగ్యజుస్సామాధర్వణాని ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠా జపే వినియోగః
కరన్యాసమ్
హ్రాం అంగుష్ఠాభ్యాం నమః
హ్రీం తర్జనీభ్యాం నమః
హ్రూం మధ్యమాభ్యాం నమః
హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః
హ్రః కరతలకర పృష్ఠాభ్యాం నమః
హ్రైం అనామికాభ్యాం నమః.
అంగన్యాసమ్
హ్రాం హృదయాయ నమః
హ్రీం శిరసే స్వాహా
హ్రూం శిఖాయై వషట్
హ్రైం కవచాయ హుం
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితి దిగ్బంధః
స్వామివారికి షోడశోపచార పూజలు
ధ్యానం : ధ్యాయేత్సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం,
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం
హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం
గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం
శ్రీసత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆవాహనం :
ఓం సహస్రశీర్షాపురుషః సహస్రాక్షస్సహస్రపాత్
సభూమిం విశ్వతోవృత్వా అత్యతిష్ఠ ద్దశాంగులమ్
జ్యోతిశ్శాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యాన గమ్యం
సాంగం సశక్తిం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుం ఆవాహయామి.
శ్రీ సత్యనారాయణ స్వామినినే నమః ఆవాహయామి, ఆవాహనార్థం అక్షతాం సమర్పయామి
ఆసనం :
ఓం పురుష ఏ వేదగ్ం సర్వం యద్భూతం యచ్ఛభవ్యం
ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతి రోహతి
కల్పద్రుమ మూలే మణివేదిమధ్యే సింహాసనే స్వర్ణమయం విచిత్రం
విచిత్ర వస్త్రావృతం అచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత
శ్రీ సత్యనారాయణస్వామినే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.
పాద్యం :
ఏతావానస్య మహిమా అతోజ్యాయాగ్ శ్చ పూరుషః
పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి
నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక పాద్యం
గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం :
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదోస్యేహాభవాత్పునః
తతోవిష్పజ్ వ్యక్రామత్ సాశనానశనే అభి
వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః
మయా నివేదితో భక్త్యాహి అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం :
తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః
స జాతోత్యరిచ్యత పశ్ఛాద్భూమి మధోపురః
మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం
తదిదం కల్పితం దేవసమ్యగాచమ్యతాం విభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి
స్నానం :
యత్పురుషేణ హవిషా దేవా యఙ్ఞ మతస్వత,
వసంతో స్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః.
తీర్థోదకైః కాంచనకుంభస్థితైః
సువాసితైర్దేవ కృపారసార్దైః
మయార్పితం స్నానవిధిం గృహాణ
పాదాబ్జ నిష్ఠ్యూత నదీప్రవాహ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః స్నపయామి
పంచామృతస్నానం
(పాలు)
ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సోమ వృష్ణియం. భవా వాజస్య సంగధేః
(పెరుగు)
దధిక్రాపుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషత్:
(నెయ్యి)
శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః
(తేనె) మధువాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః మాధ్నీర్నస్సంత్వోషధీః మధుసక్తముతోషి మధుమత్పార్ధివగ్ం రజః మధు ద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః
(మంచినీరు)
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతిప్రియ.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి.
శుద్ధోదకస్నానం (నీటితో స్నానం)
ఆపోహిష్ఠా మయోభువస్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్యక్షయాయ జిన్వథ ఆపోజనయథాచనః. నదీనాం చైవ సర్వాసమానీతం నిర్మలోదకం స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
వస్త్రం (కుంకుమ అద్దిన దూదిని సమర్పించాలి)
సప్తాస్యాసన్పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః దేవాయద్యఙ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామ సమన్వితే సర్వవర్ణప్రదే దేవ వాససీ తే వినిర్మితే
శ్రీ సత్యనారాయణస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం (కుంకుమ అద్దిన దూదిని పెట్టుకోవచ్చు.)
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం గృహాణ భగవాన్ విష్ణోః సర్వేష్టఫలదో భవ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం
తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః దివ్యశ్రీచందనం సమర్పయామి
ఆభరణం (అక్షింతలు సమర్పించవచ్చు)
తస్మాద్యజ్ఞా త్సర్వ హుతః ఋచస్సామానిజజ్ఞిరే ఛందాగ్ం సి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ఆభరణం సమర్పయామి.
పుష్పం
తస్మాద్వా అజాయంత యేకే చోభయా దతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్ఞాతా అజావయః మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి.
అథాంగపూజ
ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి
ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి
ఓం అనఘాయ నమః జానునీ పూజయామి
ఓం జనార్దనాయ నమః ఉరుం పూజయామి
ఓం విష్టరశ్రవసే నమః కటిం పూజయామి
ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి
ఓం శంఖచక్రగదాశార్జ్గపాణయేనమః బాహూన్ పూజయామి
ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి
ఓం కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి
ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి
ఓం సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రౌ పూజయామి
ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి
ఓం శ్రీ సత్యనారాయణస్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ
ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌరయే నమః, ఓం చక్రపాణయే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం జగద్యోనయే నమః, ఓం వామనాయ నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవల్లభాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం చతుర్మూర్తయే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం ఆత్మజ్యోతిషే నమః, ఓం శ్రీవత్సాంకాయ నమః, ఓం అఖిలాధారాయ నమః, ఓం సర్వలోకప్రభవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వేశాయ నమః, ఓం సర్వసాక్షికాయ నమః, ఓం హరిణే నమః, ఓం శార్ఙ్గినే నమః, ఓం హరయే నమః, ఓం శేషాయ నమః, ఓం హలాయుధాయ నమః, ఓం సహస్రబాహవే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం క్షరాయ నమః, ఓం గజారిఘ్నాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం దేవకీపుత్రాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం పార్థసారథయే నమః, ఓం అచంచలాయ నమః, ఓం శంఖపాణయే నమః, ఓం కేశిమర్దనాయ నమః, ఓం కైటభారయే నమః, ఓం అవిద్యారయే నమః, ఓం కామదాయ నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం హంసశత్రవే నమః, ఓం అధర్మశత్రవే నమః, ఓం కాకుత్థ్సాయ నమః, ఓం ఖగవాహనాయ నమః, ఓం నీలాంబుద ద్యుతయే నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిత్యానందదాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వకల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథ్వీనాథాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం గుహాశ్రయాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమతే నమః, ఓం త్రైలోక్యభూషణాయ నమః, ఓం యజ్ఞమూర్తయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం వరదాయ నమః, ఓం వాసవానుజాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం సమదృష్టయే నమః, ఓం సనాతనాయ నమః, ఓం భక్తప్రియాయ నమః, ఓం జగత్పూజ్యాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అసురాంతకాయ నమః, ఓం సర్వలోకానామంతకాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంతవిక్రమాయ నమః, ఓం మాయాధారాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం ధరధరాయ నమః, ఓం నిష్కళంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిష్ప్రపంచాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం పుణ్యకీర్తయే నమః, ఓం పురాతనాయ నమః, ఓం త్రికాలజ్ఞాయ నమః, ఓం విష్టరశ్రవసే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం శ్రీ సత్యనారాయణస్వామియే నమః అష్టోత్తర శతనామావళి సమాప్తః
నానావిధ పరిమళ,పత్ర,పుష్ప పూజాం సమర్పయామి.
ధూపం (అగరుబత్తి వెలిగించాలి)
యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూకా పూరూ పాదావచ్యేతే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృత
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ధూపమాఘ్రపయామి.
దీపం (దీపం స్వామికి చూపాలి)
బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత ఘృతాక్తవర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహమ్ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.
నైవేద్యం
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించయామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి.
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి.
అమృతాపిధానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.
॥శ్రీ సత్యనారాయణ వ్రతకథలు॥
॥అథ ప్రథమాధ్యాయము॥
శ్లో॥ ఏకదా నైమిశారణ్యే ఋషయశ్శౌనకాదయః।
ప్రపుఛ్ఛరానతం మునయ సర్వే సూతం।।
ఒకసారి కొనకాది మహామునులు నైమిశారణ్యంకి వెళ్ళి అక్కడున్న సూతమహామునిని దర్శించారు. వారు ఆయనతో “ఓ స్వామీ! సకల ఐశ్వర్యములు, పుత్రపౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి” అన్నారు దానికి వారు. “ఓ శౌనకాది మహామునులారా! పూర్వం ఇదే ప్రశ్న నారదులవారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెప్పుతాను శ్రద్ధగా వినండి.అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోక క్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరు ఆనందంగానే ఉన్నారు కాని భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. ఆ దు:ఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది. కావచ్చు, ధనధాన్యాం కోసం కావచ్చు. కారణమేదైనా దుఃఖశాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి, తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గర కెళ్ళాడు. అచ్చట నిర్మల శరీరకాంతితో నాలుగు చేతుల లో శంఖ, చక్ర, గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి “ఓ పరమేశ్వరా! నీవు అపరిమితమైన శక్తి గలవాడవు. సర్వలోకాలకు మేలు చేయగల వాడవు : భక్తుల కోర్కెలు తీర్చగలవాడవు.” అనగా విని “భక్తా ఏమి నీ కోరిక ?” అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారదమహాముని “ఓ భగవంతుడా! మానవలోకంలో ప్రతి ఒక్కరు ఏదో విధంగా బాధుడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలచుకుంటే వారికి తరుణో పాయం చూపించలేవా? నామీద నీకు ఏమాత్రం దయ ఉన్నా, వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు” అన్నాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు “ఓ నారదా! లోక శ్రేయస్సు కు నువ్వు మంచి చేయదల్చుకుంటే నేనెందుకు సాయి పడను? మానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికెలో తొలగిపోయే ప్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలని నివారించే ప్రతమొకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యధావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి.” అన్నాడు. “ఓ స్వామీ! ఆ వ్రత ఫల మెటువంటిది? దాని విధాన మేమిటి? ఇంతకు ముందు దీనినెవరు చేసారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి.” అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీ హరి “దీనిని ఆషాడంలో కాని, కార్తీక మాసంలో కాసి, మాఘమాసంలో కాని, వైశాఖంలో కాని ( ఆ, కా, మా, వై) ఏకాదశి రోజు కాని, పూర్ణిమనాడు కాని, సూర్యసంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా ఏ సంవత్సరములోనైనా చేయవచ్చు. నెల కొకసారి చేయవచ్చు, సంవత్సరానికొక సారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలెట్టె ముందు కాని, ఏదైనా పని ప్రారంభించే ముందు కాని, ఆపద కలిగి నప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున్న లేచి, కాల కృత్యాలు తీర్చుకొని, ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి: “దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా! నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీ పతీ! నా పై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను”. అలా అని భక్తి శ్రధ్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరల స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి(రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు). పూజాగృ హాన్ని శుధ్ధి చేసి, పిండితో ముగ్గులు వేసీ అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాల పరువాలి. దాని మీద బియ్యం పోసి ఒక కలశ పాత్ర (వెండి, రాగి, ఇత్తడి ఏదైనా) పెట్టి దాని మీద కొబ్బరి కాయ నుంచి దాని మీద రవికెలగుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణస్వామి ప్రతిమను చేయించి పెట్టవలెను. (అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు). సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపముపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది సవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు {వరుణదేవుణ్ణి} కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తరవాత గణేశుడు మొదలగు పంచ లోక పాలకులను అయిదుగురిని ప్రతిష్టించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విబేధాలు లేవు. ఏ వర్ణము వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయు వచ్చు. నారదా! ఈ వ్రతము అన్నిరకాల సంపదలను ఇస్తుంది. దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది.పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. వేయేల సకల సౌభాగ్యములు కలుగుతాయి” అన్నాడు. ఒక మంచి రోజు చూసి, బంధు మిత్రులను పిలిచి, పంచభక్ష్య పరమాన్నాలు చేసి, పూలు, ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి, బంధు మిత్రులకు, విందు భోజనాలు పెట్టి, ప్రసాదము తాను తిని యితరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష పలితాన్నిస్తుంది చెందినది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పి నట్లు సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు. ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయః॥ ఓం తత్సత్॥ శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ పుష్ప అక్షతాం సమర్పయామి। ధూపం సమర్పయామి॥
దీపం సమర్పయామి ॥
నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం సమర్పయామి
॥ హరతి ఇవ్వాలి.
శ్రీ సత్యనారాయణ స్వామి కి జై
॥ అథ ద్వితీయాధ్యాయః॥
ఓ ఋషులారా! పూర్వం ఈ సత్యనారాయణ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీ పట్టణములో ఒక చాలా బీద బ్రాహ్మణుడుండేవాడు. తినటానికి కనీసం సరైన తిండి కూడా లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేంటో చెప్పమని అడిగాడు. ఆ బాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి ఆ మహా విష్ణువు సత్యనారాయణుడని పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు. సమస్త దు:ఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని, ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా, వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి, మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలు దేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనం సమ కూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆదేవ దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు. అప్పటినుంచి అతను ప్రతి నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏమనుష్యుడు చేస్తాడో అతనికి సర్వదుఃఖములు తొలగుతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేసారో తెలపమని శౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. సూతమహర్శి వారు ఇలా చెప్పుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా, ఒక రోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. చాలా దాహం వేసి, నీళ్లు అడుగుదామని వస్తే, అక్కడ ఏదో పూజ జరుగుతూండటం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమని అడుగుతాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి, ఎలా కష్టాలు తొలగాయో చెప్పేసరికి, ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా ఆసక్తి కుదురుతుంది. ఆ వ్రతమయ్యేవరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని, వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానన అనుకుంటాడు. అనుకోవటమే తడవు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు,గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే అతడు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఇహ లోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్య లోకమునకు చేరాడు.
ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయో ధ్యాయః॥
ఓం తత్సత్॥ శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। ధూపం సమర్పయామి॥
దీపం సమర్పయామి
నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం సమర్పయామి ॥
హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామి కి జై॥
॥తృతీయాధ్యాయము॥
పూర్వము సత్మవాక్కు గల ఉల్కా ముఖుడనే రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవారు. అటు భద్రశీలా అనే నదీతీరమున భార్యతో కలిసి సత్యవ్రత మాచరిస్తుండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, “ఓ రాజా! ఇది ఏమి వ్రతము? దీని ఫలితమేమిటి” అన్నాడు. రాజు వివరంగా చెప్పి “నాకు పిల్లలు లేరు, పిల్లలు కలుగడానికి చేస్తున్నాను” అనగానే ఆ వైశ్యుడు, “రాజా! నాక్కూడా పిల్లలు లేరు, నేను కూడ ఈ వ్రతం చేస్తాను”, అంటూ ఆరోజు ఇంక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య యైన లీలావతికి ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోర్కెలు తీర్చే సత్య దేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు సంపద ముంపులు అని అనే మాట ఊరికే రాలేదు కదా! అమ్మాయికి కళావతి అని నామకరణం చేసారు. కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయింది.యుక్త వయస్సు వచ్చింది.భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్ళి లో చేద్దాం లే అని దాట వేశాడు. తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీ పురం లో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్ళి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్ళి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా! దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు, కొంత కాలమయ్యాక మామా, అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసాను పురానికి వెళ్ళారు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాప వశము చే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొత మంది దొంగలు రాజు గారి ఖజానా నుండి సామ్ము దొంగిలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది? ఆ భటులు మామ అల్లుళ్ళని పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీన పరచుకున్నాడు. వాళ్లు కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ యింటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినటానికి తిండిలేక, సరియన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రదికేవారు. అలా తిరుగుతుండగా కళావతి ఒక రోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి, చివరి వరకు ఉండి, తీర్థప్రసాదాలు తీస్కుని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతే కాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి, భర్తా, అల్లుడి రాకకోసం ఆగకుండా వెంటనే బంధు మిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి, భక్తిగా దేవుడ్ని వేడుకుంది. తన భర్తను, అల్లుడ్ని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్షలేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్మ దేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్ర కేతు మహారాజు కలలో కన్పించి, ఆ వైశ్యులు అమాయకులని, వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని, అలా చేయని పక్షంలో అతనికి రాజ్యనష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెప్పుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండుకొలుపులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చెఱనుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇంక భయము లేదని, దైవ వశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి, వాళ్ళకి స్నానపానాదులు చేయించి, మంచి బట్టలు యిచ్చి, వాళ్ళకి రెట్టింపు డబ్బు యిచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయో ధ్యాయః॥ ఓం తత్సత్॥ శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥
గంధ పుష్ప అక్షతాం సమర్పయామి।
ధూపం సమర్పయామి ॥
దీపం సమర్పయామి॥
నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేధ్యం సమర్పయామి॥
హరతి ఇవ్వాలి.
శ్రీ సత్యనారాయణ స్వామి కి జై॥
॥అథ చతుర్థోధ్యాయః॥
రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని పరీక్షించటానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారియై వచ్చి, “మీ ఓడలో ఎమి ఉందని అడిగాడు. వైద్యులు ఈ సన్యాసిని లెక్కచేయక పొగరుగా “ఓ దండీ! ఏముంటే నీకెందుకు? దొంగిలించటానికి వచ్చావా? ఆకులు, అలములు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసాలాడారు. “తథాస్తు” అని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడ కేసి చూడగా అతను పలికినట్లే ఆకులములు తప్పు ఏమీ లేకపోవటంతో మూర్చపోయినంత పనయి, దుఃఖించసాగాడు. అల్లుడు వెంటనే “మామా! ఇది ఆ త్రిదండి శాపమే! ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా నున్నాడు. ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి” అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి, “బాధపడకు, నువ్వు నీ మాటనుల్లంఘించావు. నా పూజకు విముఖడయ్యావు. అందుకే నీకు మాటిమాటికీ దుఃఖం కలుగుతోంది. అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు. “ఓ నారాయణ మూర్తీ! బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరు. మూఢుడనగు నేనెలా తెలుసుకొనగలను? కావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్ము. నాశక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామీ?” అన్న ప్రార్థనకు ప్రసన్నుడయిన ఆ దేవ దేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగుప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. అది చివరలో ఉంది. ఆ సంతోషవార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరుగెత్తుకొచ్చింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగి పోయేలా చేసాడు. కళావతి భర్త కనబడక పోవటంతో ఎంతో దుఃఖించింది. ఆమె దురవస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, “ఓ స్వామీ! ఇది అంతా ఆ భగవంతుని మాయ! ఆ నారాయణుని యొక్క మాయని తెలుసుకొన శక్తులెవరు?” అని విలపించింది. కళావతి తన భర్తతో సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలయింది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను,అని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు సత్యదేవుడా వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు. “ సాధూ నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడటానికి పరుగెత్తుకు వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుంది.” కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు. అక్కడికక్కడే, అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్య దేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు. అప్పట్నుంచి ప్రతి పూర్ణిమకి, సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖములను పొందాడు. ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయః॥
ఓం తత్సత్॥ శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥
గంధ పుష్ప అక్షతాం సమర్పయామి।
ధూపం సమర్పయామి ॥
దీపం సమర్పయామి॥
నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేధ్యం సమర్పయామి॥
హరతి ఇవ్వాలి.
శ్రీ సత్యనారాయణ స్వామి కి జై॥
॥అథ పంచమోధ్యాయః॥
ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజొకడు గలడు. ఒకసారి అతను వేటకి పోయి బాగా అలసి ఒక చెట్టుకింద సేద దీరుతున్నాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి, ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు. వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం భుజించటం ఇష్టంలేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు. ధనధాన్యములు అన్ని నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయక పోవటం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గరకెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడతని నూరుగురు కొడుకులను, ధనధాన్యములను తిరిగి పొందాడు. “ఓ మునులారా! చూసారా!ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు. నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయెచ్చు. ఎప్పుడైనా చేయెచ్చు. పుత్రులని పొందుతారు. బంధ విముక్తి పొందుతారు. భీతుడు భయం కోల్పోతాడు. చివరికి సత్యపురమునకి వెళ్తాడు. శౌనకాది మునులారా! ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి ముక్తి గల వాడవుతాడో అట్టి సత్యనారాయణ ప్రతమును మీకు చెప్పాను. ఇది కలియుగములో విశేషఫలప్రదము గలది, ఈ దేవుడిని సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్య దేవుడని కూడా చెప్తారు. సత్య దేవుడు ఆయా రూపములను ధరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చి సత్యరూపుడు కాగలడు. కావున ఓ మునిశ్రష్టులారా! ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్య దేవుని కృపచే నశించునని శౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు. ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమో ధ్యాయః॥ ఓం తత్సత్॥
గంధ పుష్ప అక్షతాం సమర్పయామి।
ధూపం సమర్పయామి ॥
దీపం సమర్పయామి॥
నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేధ్యం సమర్పయామి॥
హరతి ఇవ్వాలి.
శ్రీ సత్యనారాయణ స్వామి కి జై॥
మంగళం మహత్
మహా నైవేధ్యం:
చంద్రమా మనసోజాతః చక్షుస్సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత సౌవర్ణస్థాలిమధ్యే మణిగణ ఖచితే గోఘృతాక్తాన్ సుపక్వాన్ భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యాన్ అపరిమితరసాన్ చోష్యమన్నం నిధాయ నానాశాకైరుపేతం దధిమధు సగుడక్షీరపానీయయుక్తం తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్య సమన్వితం ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్
ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.
సత్యం త్వర్తేన పరిషించయామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి.
ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి.
అమృతాపిథానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.
తాంబూలం : నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ ష్ణోద్యౌస్సమవర్తత పధ్భ్యాం భూమిర్దిశశ్రోత్రాన్ తథాలోకాగ్ం అకల్పయన్ పూగీఫలైః సకర్పూరైః నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ సత్యనారాయణస్వామినే నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం : నీరాజనం గృహాణ దేవం పంచవర్తి సమన్వితం తేజోరాశిమయం దత్తం గృహాణ త్వం సురేశ్వర శ్రీ సత్యనారాయణస్వామినే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం : ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదావ ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నోవిష్ణుః ప్రచోదయాత్ శ్రీ సత్యనారాయణస్వామినే నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారం (మూడుసార్లు మీ చుట్టూ మీరు తిరిగి స్వామికి నమస్కరించాలి)
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షా జనార్దన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసారసాగరాత్ మాం త్వం ఉద్ధరస్వ మహాప్రభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి
సర్వోపచారం :
ఛత్రం సమర్పయామి
చామరం వీచయామి.
గీతం శ్రావయామి
నృత్యం దర్శయామి
నాట్యం సమర్పయామి
సమస్త శక్త్యోపచారాన్ రాజోపచారాన్ సమర్పయామి.
ప్రార్ధన :
అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం హృషీకేశం జగన్నాథం
వాగీశం వరదాయకం సగుణం చ
గుణాతీతం గోవిందం గరుడధ్వజం
జనార్దనం జనానందం జానకీవల్లభం
హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం
అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రుణాపరిపీడితే విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలాయా విత తం విశ్వం యేన తస్మై నమోనమః
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి.
ఫలం : ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ తేన మే సఫలావాప్తిః భవేత్ జన్మజన్మని శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి.
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
ఆనయా ధ్యానవాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్ సర్వాత్మకః
శ్రీ సత్యనారాయణ సుప్రీతో వరదో భవతు
శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా అనుగ్రహ ప్రాప్తిరస్తు ||
ఇతిః శ్రీ సత్యనారాయణ స్వామి పూజా సమాప్తం.
అనంతరం పూజలో పాల్గొన్న వారు, సత్యనారాయణ స్వామి కథలు విన్నవారంతా తప్పనిసరిగా స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.