Sajjanar Serious On Betting Apps Promoters | టీజీఎస్ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనర్ ( VC Sajjanar ) తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రజలను ముఖ్యంగా యువత తప్పుదారి పట్టకుండా అలర్ట్ చేస్తుంటారు.
అందులో భాగంగా ఇటీవల యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై సజ్జనర్ సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసే వారిపై కఠినంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సజ్జనర్ పోస్టులతో ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై పోలీసులు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. తాజాగా హోలీ సందర్భంగా సజ్జనర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారికి రంగు పడుద్దని ట్వీట్ చేశారు.
అదేవిధంగా మీలో ఎంతమంది బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే నకిలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ( influencers ) ను బ్లాక్ చేశారు అని యూత్ ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ లన ప్రమోట్ చేసే వారిని బ్లాక్ చేయాల్సిందిగా మీ స్నేహితులను కూడా ట్యాగ్ చేయాలని సూచించారు. వాళ్లని బ్లాక్ చేసినట్ల స్క్రీన్ షాట్లను తనకు పంపాలని సూచించారు.









