Russia Fines Google $2.5 Decillion | ప్రముఖ టెక్ ( Tech ) దిగ్గజం గూగుల్ ( Google )కు రష్యా బిగ్ షాక్ ( Big Shock ) ఇచ్చింది. గూగుల్ కు భారీ ఫైన్ విధించింది. ఈ ఫైన్ ఎంతంటే ప్రపంచంలో చలామణిలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ.
యూట్యూబ్ ( Youtube ) లో తమ దేశ ఛానెల్లను బ్లాక్ చేసినందుకు రష్యాలోని మాస్కో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన ప్రభుత్వ, అనుకూల ఇలా 17 ఛానెళ్లను యూట్యూబ్ బ్లాక్ చేసింది.
సదరు ఛానెల్స్ ను పునరుద్ధరించాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా గూగుల్ నిరాకరించింది. దింతో గూగుల్ పై మాస్కో ( Moscow ) కోర్టు భారీ ఫైన్ విధించింది. 2.5 డెసిలియన్ డాలర్లు ( Decillion Dollars ) లేదా 2 అన్ డెసిలియన్ రష్యన్ రూబెల్స్ ఫైన్ ను విధించింది.
ఒక్క అన్ డెసిలియన్ అంటే ఒకటి తర్వాత 36 సున్నాలు ఉంటాయి. అయితే ఇంతటి భారీ ఫైన్ ను చెల్లించడం గూగుల్ కు అసాధ్యం. ఎందుకంటే ప్రపంచంలోనే చలామణి లో ఉన్న డబ్బు 100 ట్రిలియన్ డాలర్లు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ ( Trillion ) డాలర్లు. ఇదిలా ఉండగా గతంలోనూ గూగుల్ కు జరిమానాలు కొత్త కాదు. గతంలో చాలా సార్లు జరిమానా పడింది.