PM Modi Warns Pak | భారత స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2025) సందర్భంగా ప్రధాని మోదీ (Narendra Modi) ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వేదికగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఉగ్రావాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అనీ గుర్తు చేశారు. పహల్గాం (Pahalgam) లో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామనన్నారు ప్రధాని మోదీ.
ఆ ఘటనతో యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోయిందనీ,. దానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టామని తెలిపారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందన్నారు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని స్పష్టం చేశారు.
నీరు, రక్తం కలిసి ప్రవహించవనీ, సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదని తేల్చి చెప్పారు. సింధూ జలాలను (Sindhu Water) భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదన్నారు. వాటిపై సంపూర్ణాధికారం భారత్, భారత రైతులది మాత్రమేని స్పష్టం చేశారు. ఆ ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదనీ, దీనిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.









