Omar Abdullah lashes out at Delhi airport | ఢిల్లీ విమానాశ్రయం పై నిప్పులుచేరిగారు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. శనివారం ముఖ్యమంత్రి జమ్మూ నుండి ఢిల్లీ బయలుదేరారు.
మూడు గంటల పాటు గాల్లో ప్రయాణించిన తర్వాత విమానాన్ని జైపూర్ కు దారి మళ్లించారు. ఈ క్రమంలో మూడు గంటల తర్వాత విమానాన్ని జైపూర్ మళ్లించడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రయాణికుల విషయంలో ఢిల్లీ విమానాశ్రయ సిబ్బంది అలసత్వం చూస్తుంటే సహనం కోల్పోయినట్లు, మర్యాదగా మాట్లాడే స్థితిలో కూడా లేనని సీఎం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ మేరకు జైపూర్ విమానాశ్రయంలో ఫ్లైట్ ముందు సెల్ఫీ దిగారు. అర్ధరాత్రి మూడు గంటకు తర్వాత ఢిల్లీ చేరుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ విమానాశ్రయం ఇప్పటి వరకు స్పందించలేదు.