Wednesday 9th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఐదుగురితో జనసేన లిస్ట్.. పవన్ కు దక్కని చోటు!

ఐదుగురితో జనసేన లిస్ట్.. పవన్ కు దక్కని చోటు!

pawan kalyan

Jana Sena First List | ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).

టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను శనివారం విడుదల చేశారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.

ఇందులో భాగంగా 5 గురు అభ్యర్థులను ప్రకటించారు ఆయన. అయితే ఈ తొలిజాబితాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చోటు దక్కలేదు.

Read Also: TDP-Janasena First List.. సీఎం జగన్ పై పోటీ చేసేది ఎవరంటే!

జనసేన ముఖ్య నేత అయిన నాదేండ్ల మనోహర్ తెనాలి స్థానం నుండి పోటీ చేస్తారని స్పష్టం చేశారు పవన్.

అలాగే నెల్లిమర్ల నుండి లోకం మాధవి, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుండి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ లు పోటీ చేయనున్నారు.

దీంతో జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు కేవలం ఐదుగురు పేర్లు ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

You may also like
‘సకాలంలో యూరియాను సరఫరా చేయండి’
‘కళ్యాణమస్తు’ పథకానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్..కారణం ఇదే!
తోడు కోసం పెళ్లి చేసుకుంటే..భర్త కాదు మోసగాడు !
‘కేటీఆర్ జన్మదినం..వినూత్నంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions