Nagavamsi About Hari Hara Veera Mallu and Kingdom | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘కింగ్డమ్’. ఈ రెండు సినిమాలకు సంబంధించి నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన పోస్టులు చేశారు.
‘మీరందరూ ఏమి ఆశిస్తున్నారో నాకు తెలియదు… కానీ జూలై 3వ తేదీ నాటికి, పీఎస్పీకే ఫ్యాన్స్ మాత్రం సర్ప్రైజ్ అవ్వడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు ఫైర్ లా కనిపించబోతున్నారు. అందరూ సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి. హరిహర వీరమల్లు ట్రైలర్ నిజంగా అద్భుతంగా ఉండబోతుంది. భారీస్థాయిలో హరిహర వీరమల్లు ట్రైలర్ ఎనర్జిటిక్ గా ఉండబోతుంది’ అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు.
దీనిపై పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు కింగ్డమ్ మూవీపై అప్డేట్ ఇవ్వాలని కోరారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నాగ వంశీ కింగ్డమ్ పై మరో పోస్ట్ చేశారు. ‘ మా టీమ్ రాత్రి-పగలు కష్టపడి మీకు కింగ్డమ్ సినిమా రూపంలో ఒక భారీ బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి పని చేస్తోంది. సినిమా చూసిన తర్వాత చెప్తున్న కింగ్డమ్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్ మరియు సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం’ అని నాగవంశీ పేర్కొన్నారు.









