Mauritius Prime Minister prays at Tirumala temple | మారిషస్ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర సోమవారం సాయంత్రం తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.
సెప్టెంబర్ 9న భారత పర్యటనకు వచ్చారు మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర. ఈ క్రమంలో భారత పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న ప్రధానమంత్రిని మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏకే సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. మారిషస్ ప్రధాని వెంట ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మారిషస్ ప్రధానికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి, టీటీడీ ఛైర్మన్ కలిసి తీర్థప్రసాదాలు అందించారు. కాగా సెప్టెంబర్ 11న ప్రధానమంత్రి మోదీతో మారిషస్ ప్రధాని భేటీ అయ్యారు.









