Madya Pradesh CM Son Wedding | ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చాలా ఆడంబరంగా, గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, స్పెషల్ సాంగ్ర్, ఏసీ కన్వెన్షన్స్ లో సినిమాటిక్ గా పెళ్లి వేడుకలను జరుపుకునే ట్రెండ్ కొనసాగతుంది.
సామాన్యుల పెళ్లిళ్లే ఇలా జరిగితే మరి ఒక రాష్ట్ర సీఎం కుమారుడి వివాహం ఏ లెవల్ జరుగుతుందో ఊహించలేం కదా. అలాంటిది మధ్యప్రదేశ్ సీఎం కుమారుడి వివాహ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిపించారు.
సీఎం మోహన్ యాదవ్ తన కుమారుడి పెళ్లిని సామాజిక బాధ్యతతో జరిపించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉజ్జయినిలో శనివారం ఒక సామూహిక వివాహ వేడుకలో 21 జంటలతో పాటు తన చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ వివాహాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు.
ఈ సామూహిక వివాహ వేడుకలోనే అభిమన్యు.. డాక్టర్ ఇషిత ఒక్కటయ్యారు. వేర్వేరు సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన 22 జంటలు ఒకే వేదికపై ఒక్కటయ్యాయి. యోగా గురు రాందేవ్ బాబా ఈ జంటలన్నింటికీ వేదమంత్రాల సాక్షిగా వివాహ క్రతువును జరిపించారు. ఓ సీఎం తన కుమారుడి పెళ్లిని ఇలా సామూహివ వివాహ వేడుకల్లో జరిపించడంతో ఈ పెళ్లి చర్చనీయాంశంగా మారింది.









