Madhavaram Krishna Rao fires on Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై సంచలన ఆరోపణలు చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే, బీఆరెస్ నేత మాధవరం కృష్ణారావు. ఇటీవల కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించిన కవిత స్థానిక ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ బ్యాచ్, కబ్జాకోరు అంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై వ్యక్తిగత విమర్శలతో ఘాటుగా స్పందించారు మాధవరం కృష్ణారావు.
కవిత మూలంగా కేసీఆర్ కు అప్రతిష్ట వచ్చిందన్నారు. కవిత అక్రమాలు ఆమె భర్త అనిల్ అక్రమాలు తనకు తెలుసని అవి బయటకు తీస్తే వాళ్ళు తట్టుకోలేరని మండిపడ్డారు. గతంలో మంత్రి పదవులను కూడా కవిత అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కవిత చరిత్ర మొత్తం లిక్కర్ అని అందుకే ఇంట్లో పెంపుడు శునకం పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నట్లు కవితపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ లోని దుస్తువులు, బంగారు షాపుల్లో కవిత చేసిన దోపిడీ తనకు తెలుసన్నారు. అలాగే హరీష్ రావును బీఆరెస్ నుండి బయటకు పంపాలి, కేటీఆర్ ను అరెస్ట్ చేయించాలి ఆ తర్వాత పార్టీని హస్తగతం చేసుకుని దోపిడీ చేసుకోవాలనేదే కవిత లక్ష్యం అని ఈ ఎమ్మెల్యే బాంబు పేల్చారు.









