Jammu Kashmir Kishtwar Cloudburst | జమ్మూకశ్మీర్ రాష్ట్ర కిశ్త్ వాడ్ జిల్లా చోసిటీలో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దింతో ఒక్కసారిగా వరదలు ప్రళయం సృష్టించాయి.
ఇదే ప్రాంతంలో మాచైల్ మాత మందిరానికి వెళ్లే ప్రయాణికుల బేస్ క్యాంపు ఉంటుంది. వాహనాలను ఇక్కడే ఉంచి, యాత్రికులు కాలినడకన మందిరానికి వెళ్తారు. అయితే మెరుపు వరదలు పోటెత్తడంతో పదుల సంఖ్యలో మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆర్మీ మరియు స్థానిక వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. వందకి పైగా మందిని కాపాడినట్లు, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.









