Indian presenter Ridhima Pathak breaks silence on exit from BPL | ఇండియన్ స్పోర్ట్స్ యాంకర్ అయిన రిధిమా పాఠక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశమే ముఖ్యమని స్పష్టం చేసిన ఆమె బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో రిధిమా హోస్టింగ్ ప్యానల్ లో భాగంగా ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ లో అశాంతి నెలకొంది. రాజకీయ అనిశ్చితి మూలంగా ఆ దేశ మైనార్టీలు అయిన హిందువులపై దాడులు అధికం అయ్యాయి. ఇదే సమయంలో ఐపీఎల్ లో భాగంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ఆడించడం పట్ల విమర్శలు వ్యక్తం అవ్వడం దింతో అతన్ని ఐపీఎల్ నుండి తొలగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఈ క్రమంలో తమ దేశంలో ఐపీఎల్ మ్యాచుల ప్రసారంపై నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీపీఎల్ లో ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న రిధిమా ఆ దేశ లీగ్ నుండి బయటకు వచ్చేశారు. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఆమెను తొలగించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై రిధిమా తాజగా స్పందించారు. తానే స్వచ్చంధంగా బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు. తనకు దేశమే ముఖ్యమన్నారు. కాగా రిధిమా తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.









