Harish Rao News | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులుచెరిగారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదని అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం మార్చు కోలేడని ధ్వజమెత్తారు. రెండేళ్లుగా కేసీఆర్ మీద, బిఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. అక్రమంగా కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్ లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు.
అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే..సీఎం మాత్రం పాలన గాలికి వదిలి ఫుట్ బాల్ ఆడుతున్నారని నిలదీశారు. ‘తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్’ అంటూ అందర్నీ మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని పేర్కొన్న హరీష్ ‘ఇందులో ఎన్ని రూ.కోట్ల స్కాంకు ప్లాన్ చేశావు ఇందులో ఎవరి వాటా ఎంత?’ అని ప్రశ్న రూపంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.









