GST On Popcorn | పాప్‌కార్న్ పై మూడు వేర్వేరు జీఎస్టీ ( GST ) రేట్లు విధించడం ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారింది.
సాల్టెడ్ ( Salted ) లేదా మసాలా పాప్‌కార్న్ లేబుల్ ( Lable ), ప్యాక్ లేకపోతే ఐదు శాతం జీఎస్టీ, ఒకవేళ ప్రీ ప్యాక్ ( Pre-Packaged ), లేబుల్ ( Labelled )ఉంటే 12% జీఎస్టీ వర్తించనున్నట్లు మండలి ( GST Counsil ) నిర్ణయం తీసుకుంది. అయితే షుగర్ కలిసిన పాప్‌కార్న్ కు మాత్రం జీఎస్టీని పెంచారు.
క్యారమెల్ పాప్‌కార్న్ ( Caramel Popcorn ) ను ప్యాకేజింగ్ తో అమ్మితే దానికి 18% జీఎస్టీ వర్తించనుంది. సాధారణంగా పాప్‌కార్న్ ను నమ్కీన్ ( Namkeen ) లా పరిగణిస్తారు. కానీ చాకలెట్ ( Chocolate ) కలిసిన పాప్‌కార్న్ ను నమ్ కీన్ లా పరిగణించలేమని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. ఈ కారణంగానే క్యారమెల్ పాప్‌కార్న్ కు 18% జీఎస్టీ విదిస్తున్నట్లు మండలి పేర్కొంది.
అయితే సులభతరం కోసం జీఎస్టీని తీసుకొచ్చామని చెబుతూ..ఇలా సంక్లిష్టంగా మార్చడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాప్‌కార్న్ పై జీఎస్టీ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.