England’s landmark Boxing Day Test win | యాషెస్ సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే కేవలం రెండు రోజుల్లోనే ఈ టెస్టు ముగిసింది. మొత్తంగా ఈ మ్యాచ్ మొత్తం కలిపి ఇరు జట్లు కేవలం 852 బంతులను మాత్రమే ఎదురుకున్నాయి. ఇకపోతే బాక్సింగ్ డే టెస్టు మ్యాచులో విజయం సాధించిన ఇంగ్లాండ్ సుమారు 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై గెలుపు రుచి చూసింది. 2011 జనవరిలో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచులో ఇంగ్లాండ్ గెలిచింది. ఈ మధ్యలో ఆసీస్ గడ్డపై 18 టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ ఒక్కదాంట్లో కూడా గెకవకపోవడం గమనార్హం.
మెల్బోర్న్ వేదికగా తాజగా ముగిసిన నాలుగవ టెస్టు మ్యాచులో బౌలర్లు ఊచకోత కోశారు. దింతో ఒక్క బ్యాట్సమెన్ కూడా 50 పరుగుల మైలురాయిని అందుకోలేదు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మరోసారి విఫలం అయ్యారు. 132 పరుగులకే చేతులెత్తేశారు. ఈ క్రమంలో 178 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దింతో 15 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.









