Deputy Cm Pawan Kalyan News | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మంత్రులు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది. అనంతరం మంత్రులు పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ. 2,123 కోట్లు నిధులు విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కి మంత్రులు ధన్యవాదాలు తెలియజేశారు.
పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి 13 గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి రూ. 18.16 కోట్లు నిధులు విడుదల చేసినందుకు హోంమంత్రి అనిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్–1 కింద విడుదలైన ఈ నిధులతో 26 జిల్లాల్లోని 157 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర 1,229 రోడ్లు బాగుపడనున్నాయని మంత్రులు వివరించారు.









