Deputy Cm Pawan Kalyan News | స్కూల్ యాజమాన్యం వేధింపుల మూలంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు మృతురాలి తల్లిదండ్రులు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రాజమహేంద్రవరం విమానాశ్రయం ( Rajahmundry Airport ) దగ్గర కొత్తపేట నియోజకవర్గం, మడికి గ్రామానికి చెందిన చెక్కపల్లి శ్రీనివాసరావు కలిసి 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె వెన్నెల కొద్ది రోజుల కిందట ఆత్మహత్య చేసుకుందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు.
చెముడులంక గ్రామంలోని శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్ స్కూల్లో వెన్నెల చదువుతుందని, దసరా సెలవులు ఇవ్వకపోవడంతో ఆమె కలెక్టర్ ( Collector ) కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం పాఠశాల యాజమాన్యం తన కుమార్తెను పరీక్షల్లో ఫెయిల్ ( Fail ) చేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు.
ఆ స్కూల్ యాజమాన్యం ఒత్తిడి, బెదిరింపుల వల్లే వెన్నెల ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని బాధితుల నుండి విన్న పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా ఎస్పీ ( SP )తో మాట్లాడి, విద్యార్థిని ఆత్మహత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.