Deputy Cm Pawan Kalyan | ‘పవన్ కళ్యాణ్ ఐదు సార్లు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను చూడాలి’ అని నేరుగా జనసేన అధినేతను ఆశీర్వదించారు ఇండ్ల నాగేశ్వరమ్మ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో బుధవారం పర్యటించారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనుల పేరుతో ఈ గ్రామంలో కొన్ని ఇండ్లను కూల్చేశారు. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే ఇండ్లను కూల్చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ఆ సమయంలో ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో గెలిచి మళ్లీ గ్రామానికి రావాలని కోరారు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు. ఆమెకు ఇచ్చిన మాట మేరకు తాజగా పవన్ ఇప్పటం వెళ్లారు. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను కలిశారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ క్రమంలో ‘నువ్వు ఐదు సార్లు ముఖ్యమంత్రి కావాలి, నేను చూడాలి’ అని ఆ వృద్ధురాలు పవన్ తో అన్నారు. దింతో చిరునవ్వు చిందించిన పవన్ ఆకెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం నాగేశ్వరమ్మకు రూ.50 వేల చెక్కు, ఆమె మనవడి చదువుకోసం రూ.లక్ష చెక్కు అందించారు.









