Congress Govt Debts | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన ఖర్చులు, కొత్తగా తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 15 ఏప్రిల్ 2024 వరకు రూ. 66, 507 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు.
అలాగే కొత్తగా రూ.17, 618 కోట్ల అప్పు చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ.22, 328 కోట్లు, వడ్డీలు, అప్పుల కిస్తీల రూపంలో రూ.26, 374 కోట్లు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.
రైతు భరోసా కింద రూ.5,575 కోట్లు, చేయూత ద్వారా రూ.3, 840 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రూ.1,125 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కోసం రూ.3,924 కోట్లు, రైతు బీమా కోసం రూ.734 కోట్లు, గృహజ్యోతి పథకం కోసం రూ.200 కోట్లు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.