CM Revanth Wants Kite Festivals at Restored Lakes | సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని చెరువులవద్ద పర్యాటక శాఖతో కలిసి జనవరి 11, 12, 13 తేదిల్లో మూడు రోజులు ఘనంగా కైట్ ఫెస్టివల్ ను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి హైడ్రా ఆధ్వర్యం లో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణను గురించి వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తుమ్మిడికుంట లో ఐటీ ప్రముఖులు, ఉద్యోగులు, కూకట్ పల్లి నల్లచెరువు చెరువు దగ్గర సినిమా ప్రముఖులను కైట్ ఫెస్టివల్ కి ఆహ్వానించాలని సూచించారు. అదేవిధంగా రాజేంద్రనగర్ బురుకుద్దిన్ చెరువు దగ్గర క్రీడాకారులతో కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని తెలిపారు.









