Cm Revanth Responds To Pm Modi Allegations | ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) చేసిన ఆరోపణలకు బదులిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ), కర్ణాటక ( Karnataka ), తెలంగాణ ( Telangana )లో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్పందించారు.
డిసెంబర్ 7 2023న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కేవలం రెండురోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ ( RTC ) బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కవరేజిని రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తుచేశారు.
దాదాపు దశాబ్దం పాటు BRS దుష్పరిపాలన తర్వాత రాష్ట్రాన్ని ఆనందం & ఆశలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. అలాగే 22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ( Gas Cylinder ) వంటి పథకాలను మొదలుపెట్టినట్లు చెప్పారు.
గ్రూప్ పరీక్షలు నిర్వహించడం మరియు 50,000 మందికి ఉద్యోగాల నియామక పాత్రలను అందించమన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు చేసిన వాగ్దానాల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.