Cm Revanth Reddy About Caste Census In Telangana | దేశ వ్యాప్తంగా తెలంగాణ కుల గణన సర్వేకు ప్రశంసలు అందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో పూర్తి చేసిన సమగ్ర కుల గణన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కులగణన సర్వే విజయవంతంగా పూర్తి అయిందన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
సర్వే కు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని, ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2 వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీ కి అందజేస్తామని స్పష్టం చేశారు.