CM Revanth Inaugurates Electric Car | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రూపొందించిన సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారును సీఎం లాంఛనంగా ఆవిష్కరించి దానిని కొద్ది దూరం నడిపారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి కారును పరిశీలించారు. ఒలెక్ట్రా సీతారాంపూర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో ఈ కారును రెండు బ్యాటరీలు కలిగి ఉండేలా రూపొందించారు.
ఇండిజీనియస్ మాడ్యులార్ స్కేట్‌బోర్డు ఫ్లాట్‌ఫామ్‌తో వివిధ వేరియంట్లతో సెడాన్, ఎస్యూవీ మాడళ్లను రూపొందించారు. కారును ఆవిష్కరించిన అనంతరం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నూతన ఎలక్ట్రిక్ బస్సు 12 మీటర్ల సూపర్ లగ్జరీ బస్సు ను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.









