CM Chandrababu Says ‘The G in Vizag Now Stands for Google’ Andhra Pradesh | ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని పేర్కొన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ లో అత్యధిక పెట్టుబడులు రాబోతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు.
మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు దిగ్గజ సంస్థ గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిన విషయం తెల్సిందే. రాబోయే ఐదేళ్లలో గూగుల్ ఏపీలోని విశాఖలో 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టబడి పెట్టనుంది. విశాఖను ఏఐ మార్చేందుకు ఇది ఒక పునాది అని సీఎం చంద్రబాబు, గూగుల్ ప్రతినిధులు పేర్కొన్నారు.
గూగుల్ వైజాగ్ లో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో స్పందించిన చంద్రబాబు గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్, నేడు విశాఖకు గూగుల్ ను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని పోస్ట్ చేశారు.









