Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు హామీ..రజినీకాంత్ ఇంటిముందు ఎలక్ట్రిక్ ఆటో |

చంద్రబాబు హామీ..రజినీకాంత్ ఇంటిముందు ఎలక్ట్రిక్ ఆటో |

Cm Chandrababu Helps Auto Driver | సీఎం చంద్రబాబు ( Cm Chandrababu )రెండు రోజుల వ్యవధిలోనే ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గుడివాడ ( Gudivada ) పట్టణంలో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా వలివర్తిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రజినీకాంత్ సీఎంతో మాట్లాడారు. ఈ సమయంలో డీసీల్ ఆటోను ఎలక్ట్రిక్ ( Electric ) గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా అని బాబు సూచించారు. అయితే తనవద్ద అంత డబ్బులేదని ఆటోడ్రైవర్ ( Auto Driver ) తన ఆర్థిక స్థోమతను వివరించారు.

దింతో ఎలక్ట్రిక్ ఆటోను ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను రజినీకాంత్ కు అందించారు. రజినీకాంత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుటుంబానికి చంద్రబాబు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.

You may also like
‘కేసీఆర్ బీఆరెస్ ను పాతిపెట్టాలి..అదే ఎన్టీఆర్ కు ఘన నివాళి’
షాద్ నగర్-తిరుమల..చంద్రబాబు కోసం బండ్ల గణేశ్ పాదయాత్ర
చంద్రబాబుకు నియామక పత్రం అందజేసిన సీఎం రేవంత్
కృష్ణా నదీ తీరం..పీపీపీ మోడల్ లో టెండర్లు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions