Claim of 100% Traffic Challan Discount on December 13 Is Fake | పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై భారీ ఆఫర్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. డిసెంబర్ 13న నాలుగవ జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. ఈ క్రమంలో ఆరోజు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి 50 శాతం నుంచి 100 శాతం వరకు డిస్కౌంట్ లభించబోతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.
కానీ ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు, లోక్ అదాలత్
నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం స్పష్టం చేసింది. ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దు లేదా షేర్ చేయవద్దని పోలీసులు కోరారు. కేవలం అధికారిక ఖాతాల నుండి వెలువడే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని పోలీసులు పేర్కొన్నారు.









