Monday 19th May 2025
12:07:03 PM
Home > తాజా > కలకాలం గుర్తుండిపోయే అపురూప జ్ఞాపకం: చిరంజీవి ట్వీట్!

కలకాలం గుర్తుండిపోయే అపురూప జ్ఞాపకం: చిరంజీవి ట్వీట్!

modi chiru pawan

Chiranjeevi Tweet | ఏపీ కేబినెట్ (AP Cabinet) ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోదీ (Modi).. చిరంజీవి, (Chiranjeevi) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతులు పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు.

కాగా ఈ ఘటనకు సంబంధించి ప్రధానితో జరిగిన సంభాషణను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ, నాతోనూ ఈ రోజు  వేదిక  పైన  ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు, ‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి  మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి  గురిచేసిందని  చెప్పారు.

కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి  ఒక్క  అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి’ అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి  సునిశిత  దృష్టికి, నా కృతజ్ఞతలు!. తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!” అని వెల్లడించారు చిరంజీవి.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions