Chiranjeevi and Venkatesh all set to share screen | మెగాస్టార్ చిరంజీవి-విక్టరీ వెంకటేశ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ‘మన శివశంకర వరప్రసాద్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇందులో వెంకటేశ్ సైతం నటించారు. ఈ క్రమంలో శివశంకర వర ప్రసాద్ మూవీలో తన పాత్ర షూటింగ్ పూర్తి అయినట్లు వెంకటేశ్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది చాలా గొప్ప అనుభవం అని, తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సినిమా తనకు చాలా అందమైన జ్ఞాపకాలను ఇచ్చిందని వెంకటేష్ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో వెండితెరపై కలిసి నటించేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి దీనిని నిజం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. 2026లో ప్రేక్షకులు, అభిమానులతో కలిసి థియేటర్లలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు విక్టరీ వెంకటేష్ పోస్ట్ చేశారు.









