Chhattisgarh Women Steals Rs. 2 Lakh To Buy Boyfriend A bike | ప్రియుడికి బైక్ కొనిపెట్టేందుకు ఓ ప్రియురాలు చాలా పెద్ద సాహసం చేసింది.
బంధువుల ఇంట్లో చోరీ చేసి ఆ డబ్బులతో ప్రియుడికి బైక్ కొనివ్వాలని భావించింది. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయింది.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో 22 ఏళ్ల కరుణ పటేల్ అనే యువతి, 24 ఏళ్ల విశ్వకర్మ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రియుడు తనకు బైక్ కావాలని ప్రియురాలని కోరాడు. దింతో కరుణ పటేల్ తన బంధువుల ఇంటికే కన్నం వేసింది.
దూమర్పని గ్రామంలో ఉండే బంధువు కన్నయ్య పటేల్ ఇంట్లో చోరీ చేసేందుకు ప్రియుడితో కలిసి ప్రియురాలు ప్లాన్ వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడు బయట ఉండగా, ప్రియురాలు ఇంట్లోకి వెళ్ళింది.
రూ.95 వేల నగదు, రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేసింది. నగదును ప్రియుడికి ఇచ్చి బైక్ ఖరీదు చేసుకోవాలని చెప్పింది. బంగారు ఆభరణాలను మాత్రం తన వద్దే ఉంచుకుంది. చోరీ నేపథ్యంలో కన్నయ్య పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చోరీకంటే ముందు కన్నయ్య పటేల్ ఇంటిముందు ఈ ప్రేమ జంట అనుమానాస్పదంగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. విచారించగా ఈ జంట నిజం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి వీరిని జైలుకు తరలించినట్లు కాంకేర్ అదనపు ఎస్పీ దినేష్ సిన్హా తెలిపారు.









