Bomb Threat calls For Schools | కర్ణాటక రాజధాని బెంగుళూరు (Bengaluru) లో పదుల సంఖ్యలో బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని మెయిల్ ఐడి నుండి పలు పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి.
శుక్రవారం ఉదయం తొలుత 7 స్కూల్స్ కు బెదిరింపులు రాగా, అనంతరం ఆ సంఖ్య 44 కు పెరిగింది. దింతో అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలకు సెలవును ప్రకటించారు.
ఈ బెదిరింపులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. రంగంలోకి దిగిన పోలీసులు సిబ్బందిని బయటకు పంపి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టాయి.
ఇదిలా ఉండగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఇంటి సమీపంలో ఉన్న ఒక పాఠశాలకు కూడా బెదిరింపులు రావడంతో, ఆ సదరు స్కూల్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు ఆయన.
కాగా గత ఏడాది కూడా బెంగుళూరు లో 7 పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
విచారణ జరిపిన పోలీసులు అవి నకిలీ బెదిరింపులని తెలిపారు. ఇప్పుడు కూడా నకిలీ బెదిరింపులే అయి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.