BJP Wins Thiruvananthapuram Corporation in Kerala | కేరళ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కంచుకోటలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 ఏళ్ల అధికారంలో ఉన్న లెఫ్ట్ పార్టీల కూటమిని ఓడించిన బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ గెలుపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.
కేరళ రాజధాని తిరువనంతపురం కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కార్పోరేషన్ లోని 101 వార్డుల్లో 50 చోట్ల బీజేపీ, ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు గెలిచారు. పాలక్కడ్ మున్సిపాలిటీని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని మోదీ కేరళ రాజకీయాల్లో ఇదో కీలక మలుపన్నారు. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్ తో పోల్చితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధిక స్థానాలను కైవసం చేసుకుంది. 2026లో ఈ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే.









